విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్
వాజేడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం మూడో విడత పోలింగ్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలన్నారు. నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో విజయ, ఎంఈవో వెంకటేశ్వర్లు ఉన్నారు.


