జిల్లాస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ములుగు రూరల్ : జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో జాకారంలోని పీఎంశ్రీ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. జిల్లా స్థాయి పోటీల్లో అండర్–17 కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో, ఫుట్‌బాల్ క్రీడల్లో ప్రథమ స్థానం సాఽధించడం ఆనందంగా ఉందన్నారు. డీఈఓ సిద్ధార్థ్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారని పేర్కొన్నారు. అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో రాంచరణ్ గోల్డ్ మెడల్, షాట్‌ఫుట్‌లో క్యాంస పథకం సాధించారని తెలిపారు. 100 మీటర్ల పరుగులో చరణ్ కాంస్య పథకం సాధించి ఓవరల్ జిల్లా చాంపియన్‌గా నిలిచారని వెల్లడించారు.


