నైట్ విజిట్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను మంత్రి సీతక్క గురువారం రాత్రి పరిశీలించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణం పనులను పరిశీలించారు. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జాతరకు ముందుగా పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ఉన్నారు.


