గ్రామాలాభివృద్ధికి కృషి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గ్రామాలాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను మంత్రి సీతక్క కలిసి బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు బేదాభిప్రాయాలు లేకుండా కలిసి కట్టుగా పనిచయాలన్నారు. ప్రతీ గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి పల్లెల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికై న అంకంపల్లి, నర్సాపూర్, పంబపూర్ గ్రామాల సర్పంచ్‌లను, వార్డు సభ్యులను మంత్రి సీతక్క శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఉపసంహరించుకున్న అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని రానున్న రోజుల్లో పదవులు వరిస్తాయని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మహిళా అధ్యక్షురాలు సోమ నాగమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర చైర్మన్ లచ్చుపటేల్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పాక సాంబయ్య పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క


