విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ములుగు రూరల్: విద్యార్థినులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మదవరావుపల్లి కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో రూ.2.30 కోట్లతో నిర్మించిన తరగతి గదులు, ప్రయోగశాలను కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే విద్యాబోధన చేశారన్నారు. బాలికలు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకుంటు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రానున్న పదోతరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఎడ్యుకేషన్ ఇంజనీర్ అరుణ్‌కుమార్, డీఈఓ సిద్ధార్థ్‌రెడ్డి, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అలాగే డివిజనల్ రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం డీఎల్‌ఆర్ పంక్షన్ హాల్‌లో ములుగు డివిజన్ ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ ప్రమాణస్వీకరానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రవీందర్, డైరెక్టర్‌లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర యాత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, రవిచందర్, కల్యాణి, నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క


