క్రాప్ బుకింగ్‌లో ముందంజ
న్యూస్‌రీల్
జిల్లాలో సర్వే వివరాలు
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం
ములుగు రూరల్: పంట ఉత్పత్తుల అమ్మకాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టింది. అన్నదాతలు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి యాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా క్రాప్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఇప్పటివరకు 98 శాతం పూర్తయింది. రాష్ట్రంలో జిల్లా డిజిటల్ క్రాప్ సర్వేలో రెండో స్థానంలో ఉంది.
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు సాగు చేసిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటలను నమోదు చేస్తున్నారు. రైతులు సాగు చేసిన పంటలను సర్వే నంబర్ ఆధారంగా సాగు చేసిన పంట విస్తీర్ణం ఫొటోలతో సహ నమోదు చేస్తున్నా రు. ఏఈఓలు క్లస్టర్ల వారీగా పురుషులు 2వేల ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాలను నమో దు చేయాల్సి ఉంది. డిజిటల్ సర్వేలో ఏఈఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నమోదు చేసే విధంగా యాప్ రూపొందించారు.
అత్యధికంగా వరి సాగు
జిల్లాలోని 10 మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, కంది పంటలను సాగు చేశారు. ఇందులో వరి అత్యధికంగా 1.25 లక్షల ఎకరాలు సాగు చేయగా లక్ష ఎకరాలను యాప్‌లో నమోదు చేశారు.
ప్రభుత్వం 33 రకాల సన్నధాన్యానికి బోనస్ చెల్లిస్తుండటంతో రైతులు సాగు చేసిన విత్తన రకం తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్‌లో రైతు పేరు, ఆధార్, ఫోన్ నంబర్ నమోదు చేయాలి. రైతు సాగు చేసిన పంటల వివరాలను రైతు మొబైల్ నంబర్‌కు సమాచారం చేరేలా ఏర్పాటు చేస్తున్నారు. పంటలు సాగు చేయని పక్షంలో ‘నో క్రాప్’ అని నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రాప్ పూర్తయిన తర్వాత గ్రామ పంచాయతీలో సాగు వివరాలను పదర్శించాలి. పంటల నమోదులో తప్పులు నమోదైనట్లయితే ఏఈఓలకు తెలియజేసి మార్పులు, చేర్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
డిజిటల్ క్రాప్ సర్వేలో జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఇందుకు ఏఈఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే పూర్తి చేశారు. వారి కృషి అభినందనీయం. తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో నెట్‌వర్క్ సమస్య కారణంతో సర్వే పూర్తిగా చేయలేకపోయాం. మ్యానువల్‌గా నమోదు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు విన్నవించాం.
– సురేష్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
●
98శాతం డిజిటల్ సర్వే పూర్తి
జిల్లాలో 1.25లక్షల
ఎకరాల్లో వరి సాగు
చివరి దశకు చేరిన పంటల నమోదు
క్రాప్ బుకింగ్‌లో ముందంజ
క్రాప్ బుకింగ్‌లో ముందంజ
క్రాప్ బుకింగ్‌లో ముందంజ


