లక్కు..కిక్కు
ములుగు: జిల్లాలో ప్రతీ రెండేళ్లకోసారి నిర్వహించే మద్యం షాపుల టెండర్లు కొందరికి లక్కు కలిసి రాగా మరికొందరికి నిరాశ ఎదురైంది. జిల్లాలోని 25 షాపులకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌హౌస్‌లో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా లాటరీ పద్ధతిని నిర్వహించారు. జిల్లాలో 25 షాపులకు 726 దరఖాస్తులు రాగా రూ.21.78 కోట్ల ఆదాయం సమకూరింది. గోవిందరావుపేట మండలంలోని రెండు షాపులకు కేవలం మూడేసి చొప్పున దరఖాస్తులు రావడంతో ఆ మద్యం దుకాణాల లాటరీ పద్ధతిని నిలిపేశారు. 10 దరఖాస్తుల కంటే ఎక్కువ పడితేనే లాటరీ పద్ధతి నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని మిగిలిన 23 మద్యం షాపులకు డ్రా పద్ధతిన షాపులను ఎంపిక చేశారు. జిల్లాలో అత్యధికంగా మల్లంపల్లి, జంగాలపల్లి షాపులకు దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వేసుకొని గ్రూపులుగా ఏర్పడి భారీ సంఖ్యలో వైన్ షాపులకు దరఖాస్తు చేసినప్పటికీ లాటరీలో షాపు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. షాపులు దక్కించుకున్న 23 మంది సంబురాలు చేసుకున్నారు. షాపులు దక్కించుకున్న వారు నేడు (మంగళవారం) వైన్స్ ఫీజుల్లో ఆరో వంతు డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. కొత్త వైన్ షాపులు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ములుగు ఎకై ్సజ్ సీఐ సుధీర్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మద్యంషాపులకు
లాటరీ పద్ధతిన కేటాయింపు
జిల్లాలో 25 వైన్స్‌కు,
726 దరఖాస్తులు
నిరాశలో 701 మంది
డిసెంబర్ 1 నుంచి
నూతన వైన్‌షాపులు


