క్యూలైన్లపై నిర్మించిన షెడ్డు తొలగింపు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో భక్తుల క్యూలైన్‌లపై నిర్మించిన రేకుల షెడ్డు ఆర్చీ ద్వారానికి అడ్డుగా ఉంటుందని తొలగిస్తున్నారు. పీఆర్‌శాఖ ఆధ్వర్యంలో భక్తుల క్యూలైన్లపై షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.80కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో మీడియా పాయింట్ మంచె పక్కన షెడ్డు నిర్మించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా షెడ్డు నిర్మించిన ప్రదేశంలో ఆర్చీ ద్వారం షెడ్డు కింద నుంచి మార్కింగ్ వేశారు. ఆర్చీ గేట్‌కు షెడ్డు అడ్డుగా ఉంటుందని, దీంతో ఆర్చీ ద్వారం కనిపించకుండా పోతుందని భావించిన జిల్లా అధికారులు షెడ్డు తొలగించాలని ఆదేశించడంతో కాంట్రాక్టర్ నిర్మించిన షెడ్డును రెండు రోజుల నుంచి తొలగింపు పనులు చేపట్టారు. జిల్లా అధికారుల సూచనల మేరకు తొలగించిన షెడ్డు రేకులను టీడీడీ కల్యాణ మండపం పక్కన క్యూలైన్లపై ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


