
నేటి బంద్‌కు తరలిరావాలి
ఏటూరునాగారం: నేటి బీసీ బంద్ కార్యక్రమానికి మండలంలోని బీసీ సంఘాల నాయకులు, ప్రజలు తరలిరావాలని బీసీ సంఘం జిల్లా నాయకులు చిటమట రఘు, బట్టు గోపి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని చేస్తున్న పోరాటానికి ఐక్యంగా కదలిరావాలన్నారు. నేడు రామాలయం నుంచి బస్టాండ్ వరకు బీసీ సంఘాల నాయకులు ర్యాలీగా కదలిరావాలన్నారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నేడు తలపెట్టిన బంద్‌ను రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని బీసీ జిల్లా సంఘం నాయకులు వంగపండ్ల రవి, సర్దార్ పాషా తదితరులు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు ఇవ్వాలని వారు తెలిపారు.
బంద్‌కు బీజేపీ మద్దతు
ములుగు రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు బీజేపీ సంపూర్ణ మ ద్దతు ప్రకటింస్తుందని జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్‌లపై చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు జవహార్, రవింద్రాచారి, రాజ్‌కుమార్, విశ్వనాథ్, నాగరాజు, రవిరెడ్డి, రాజన్న, రఘువీర్ పాల్గొన్నారు.