
పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ దివాకర
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దివాకరటీఎస్ సంబఽంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడారంలో అమ్మవార్ల అలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు మ్యాప్ ప్రకారం చేయాలని అధికారులను సూచించారు. మేడారానికి అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ప్రస్తు తం జరుగుతున్న పనుల ఏర్పాట్లపై కలెక్టర్‌కు నమునా మ్యాప్ ద్వారా అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గరావు, ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేష్‌బాబు, అధికారులు ఉన్నారు.