
రాజకీయాలకతీతంగా బీసీలు ఏకం కావాలి
● బీసీ ఫోరం రాష్ట్ర నాయకుడు వీరస్వామి
ములుగు: రాజకీయాలకు అతీతంగా బీసీలందరూ ఏకం కావాలని బీసీ ఫోరం రాష్ట్ర నాయకుడు డాక్టర్ వీరస్వామి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ముంజాల భిక్షపతి అధ్యక్షతన గురువారం నిర్వహించిన బీసీ జేఏసీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రధాన రాజకీయ పార్టీల కుట్రల వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదని తెలిపారు. రేపటి బంద్‌ను ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా బీసీ జేఏసీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముంజాల భిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తోటకూరి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా వీరబాబు, కార్యదర్శిగా చక్రపాణితో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జంపాల రవీందర్, వడ్డెపల్లి సారంగపాణి, ఉపేంద్ర, దేవేందర్, రత్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.