
సీపీఆర్‌పై అవగాహన ఉండాలి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు రూరల్: సీపీఆర్‌పై వైద్య ఆరోగ్యశాఖ ప్రతీ ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె జబ్బుల ద్వారా మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయి గుండె కొట్టుకోవడం ఆగిపోతుందన్నారు. అలాంటి వారిని సీపీఆర్ ప్రక్రియ ద్వారా కాపాడవచ్చని తెలిపారు. అనంతరం సీపీఆర్‌పై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఆరోగ్య కార్యాక్రమాలపై పునః సమీక్ష చేశారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వ్యాదిగ్రస్తులకు న్యూటిషన్ కిట్‌లను అందించాలన్నారు. పిల్లలకు టీకాలు ఇచ్చి ఈవిన్ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతి కుమార్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, పవన్‌కుమార్, రణదీర్, సిబ్బంది పాల్గొన్నారు.