గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

Oct 16 2025 6:14 AM | Updated on Oct 16 2025 6:14 AM

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

ఐసీడీఎస్‌ సీడీపీఓ శిరీష

ములుగు రూరల్‌: గర్భిణులు పౌష్టికాహారం తప్పని సరిగా తీసుకోవాలని సీడీపీఓ శిరీష అన్నారు. ఈ మేరకు ములుగు ప్రాజెక్టు పరిధిలోని రాంనగర్‌తండా, వెంకటాపురం(ఎం) సెక్టార్‌లో పొరకలపల్లిలో బుధవారం పోషణ కుటుంబ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీడీపీఓ శిరీష మాట్లాడారు. బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు పౌష్టికాహారం, మిటమిన్లతో కూడిన ఆహా రం తీసుకోవాలన్నారు. కిశోర బాలికలకు రక్తహీనతపై అవగాహన కల్పించారు. ఐరన్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు అనంతలక్ష్మీ, రమాదేవి, కళావతి, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement