
సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి
ములుగు రూరల్: కార్డియో పల్మనరీ పునర్జీవనం(సీపీఆర్)పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బండారుపల్లి గురుకుల పాఠశాలలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించే సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా మనిషి ఒత్తిడికి లోనైనప్పుడు రక్తప్రసరణ ఆగిపోతుందని తెలిపారు. దాని ఫలితంగా గుండె, మెదడు, అవయవాలు ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రసరణ చేయలేకపోవడంతో మనిషి జీవచ్ఛవంలా పడిపోతాడని వివరించారు. అలాంటి వ్యక్తికి సీపీఆర్ చేసి రక్త ప్రసరణ పునరుద్ధరించడంతో పాటు ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రణధీర్, డోమో సంపత్, ఎన్సీడీ కోఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ విజేందర్, తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
విపిన్‌కుమార్