
పిడుగు పాటుతో వ్యక్తి మృతి
వెంకటాపురం(కె): మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగు పాటుతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కొండాపురం గ్రామానికి చెందిన మొర్రం సమ్మ య్య (46) అనే వ్యక్తి గురువారం గ్రామ శివారులో పశువులను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా, ఒక్కసారిగా సమ్మయ్యకు సమీపంలో పిడుగుపడింది. తీవ్రగాయాలైన అతన్ని కుటుంబ సభ్యులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలి ంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయా డు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు.