
రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం
ములుగు రూరల్: బీసీలను రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రవింద్రాచారి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కాదని తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ పార్టీ విధానానికి సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాడి వెంకట్, తిరుపతిరెడ్డి, కుమార్, సతీష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.