
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
ములుగు రూరల్: రాష్ట్రంలో రెండు దఫాలుగా నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మూడు దపాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్‌లను తొలగించాలని సూచించారు. పీఓలకు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారి
రాణి కుముదిని