
సమస్యల పరిష్కారానికి కృషి
● టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్
కాటారం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ అన్నారు. కాటారం మండలకేంద్రంలో ఆదివారం టీఆర్‌టీఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్టీయూ రాష్ట్ర బాధ్యుడు హట్కర్ రమేశ్‌నాయక్, మండల అధ్యక్షుడు రేపాల వేణుగోపాల్, పీర్ల మోహన్‌రావు, కోటేశ్వర్, సబిత, వెంకటేశ్, కృపాకర్ తదితరులు టీఆర్‌టీఎఫ్ సభ్యత్వం తీసుకున్నారు. నూతనంగా చేరిన వారికి రాష్ట్ర అద్యక్షుడు కటకం రమేశ్, మెంబర్‌షిప్ రాష్ట్ర కన్వీనర్ సుంకేసుల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ టీఆర్‌టీఎఫ్ సిద్ధాంతం భావజాలం సామాజిక కోణంతో ముడిపడి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువత సంఘంలోకి రావాలని, భవిష్యత్ తరాలకు దిక్సూచి అవుతూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెండెం మధుసూదన్, కార్యదర్శి రవీందర్, కార్యవర్గ సభ్యులు సమ్మయ్య, రఘుకుమార్, ఆజ్మీర అనిల్, రాజునాయక్, పరంసింగ్ తదితరులు పాల్గొన్నారు.