
ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
ములుగు: ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరగనున్న వేడుకలకు మంత్రి సీతక్క హాజరు కానున్నట్లు తెలిపారు. నేటి ఉద యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జీపీల్లో ప్రత్యేక అధికా రులు జాతీయ పతా కాన్నిఆవిష్కరించాలని సూచిం చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌కు ఉదయం 9.55 గంటలకు మంత్రి సీతక్క చేరుకుంటారని పేర్కొన్నారు. 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చే స్తారు. ఉదయం 10.05 గంటలకు గౌరవ వందనం స్వీకరించి 10.10 గంటలకు సీతక్క ప్రసంగిస్తారని వెల్లడించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ కార్యాలయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది.

ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి