
సన్నధాన్యం బోనస్ చెల్లించాలి
ములుగు: యాసంగి సన్న ధాన్యానికి చెందిన బోనస్ డబ్బులు చెల్లించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ములుగు జాతీయ రహదారిపై నాయకులు ఽరాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్ పాషా మాట్లాడారు. యాసంగి సీజన్‌లో అమ్మిన సన్నధాన్యం బోనస్ నాలుగు నెలలు అయినా రైతులకు అందలేదన్నారు. 33.786 క్వింటాళ్లకు చెందిన బోనస్ రైతులకు అందాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, పంటలకు కనీసం యూరియా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతులకు బోనస్ వెంటనే చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు బానోతు నారాయణ సింగ్, జీవన్ రెడ్డి, మంకిడి కృష్ణయ్య, తిరుపతి రెడ్డి, మహేందర్, యాకయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రైతుసంఘం ఆధ్వర్యంలో
ఎన్‌హెచ్‌పై రాస్తారోకో