17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ | - | Sakshi
Sakshi News home page

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌

Sep 13 2025 2:41 AM | Updated on Sep 13 2025 2:41 AM

17నుం

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ కార్మికులకు బీమా వర్తింపజేయాలి దేవగిరిపట్నంలో న్యాయవిజ్ఞాన సదస్సు కోతుల బారి నుంచి రక్షించాలి ఆరుగురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష

ములుగు రూరల్‌ : ఈ నెల 17నుంచి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించే స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధి కారి గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు మాట్లాడుతూ కార్యక్రమాలను వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు పర్యవేక్షించినప్పుడే ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కువ ప్రసవాలు అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ చంద్రకాంత్‌, పవన్‌కుమార్‌, శ్రీకాంత్‌ రణధీర్‌, సంపత్‌ ఉన్నారు.

ములుగు రూరల్‌ : మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం బీమా వర్తింపజేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మల్లంపల్లి యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. భోజనం తయారు చేస్తున్న సమయంలో కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు గున్నాల రాజకుమారి, పద్మ, శ్రీనివాస్‌, కమల, రాధ, భగ్య, కనుకలక్ష్మీ, పూల, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

ములుగు రూరల్‌ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దేవగిరిపట్నం జిల్లా పరిషత్‌ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మేకల మహేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మోటారు వెహికిల్‌ చట్టం, బా ల్యవివాహ నిరోధక, బాలకార్మిక చట్టాల గు రించి వివరించారు. డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ బానోత్‌ స్వామిదాస్‌ పోక్సో, నిర్భంద విద్యాహక్కుల చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏజీపీ బా లుగు చంద్రయ్య, ప్రధానోపాద్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గోవిందరావుపేట : కోతుల బారి నుంచి ప్రజలను రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ అన్నారు. మండలంలో రో జురోజుకి కోతుల బెడద తీవ్రమవుతుందని వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పస్రా సెంటర్‌లో శుక్రవారం భారీ ర్యాలీ తీసి గ్రామ పంచా యతీ, ఫారెస్ట్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ మండలంలో విచ్చలవిడిగా కోతులు వీరంగం సృష్టిస్తున్నాయని పగలు, రాత్రి తేడా లేకుండా ఇళ్లలోకి వస్తున్నాయని, ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వం, గ్రామ పంచాయతీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ను సమన్వయపరిచి కోతులబెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ములుగు రూరల్‌/గోవిందరావుపేట: మద్యం తాగి వాహనాలు నడుపొద్దని ఎస్సై వెంకటేశ్వర్‌రావు తెలిపారు. గతంలో మద్యం తాగి పట్టుబడిన 91 మందిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. దీంతో ములుగు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి 85 మందికి రూ.1.68 లక్షల జరిమానా విధించినట్లు తెలి పారు. ఆరుగురు వ్యక్తులకు రెండు రోజుల సాధారణ శిక్షతో పాటు రూ.12 వేలు జరిమానా విధించినట్లు వెల్లడించారు.

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ 
1
1/3

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ 
2
2/3

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ 
3
3/3

17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement