
పరిహారం కోసం ఐక్యంగా ఉద్యమించాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం ప్రాంత రైతులకు పంట నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించేంత వరకు రైతుల పక్షాన ఐక్యంగా ఉద్యమించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కొత్తూరులో జాతర పంట నష్టపరిహార సాధన సమితి అధ్యక్షుడు అల్లెం కృష్ణార్జున్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథులుగా బీర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి, జి ల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మేడారం జాతర సందర్భంగా రెండో పంట సా గుచేయకుండా నష్టపోతున్న మేడారం, ఊరట్టం, నార్లాపూర్, వెంగళపూర్, రెడ్డిగూడెం, కన్నెపల్లి రైతులకు ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, పంట నష్టపరిహార సాధన సమితి చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ జీఓ ఇచ్చేంత వరకు రైతులు ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేడారం ప్రాంత రైతుల ప్రధాన సమస్య అయినటువంటి జంపన్నవాగు, తూముల వాగుపై కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీధర్, బాబు రావు, అరుణ, కమిటి ఉపాధ్యక్షులు హనుమంత రెడ్డి, శ్రీను కిరణ్, రమేష్, మొక్క నరేందర్, ప్రధా న కార్యదర్శులు చర్పా చంద్రశేఖర్, ముర్తేష్, నరేష్, ప్రణయ్. బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, సీపీఎం నాయకులు శివరాజ్, శ్యామ్ ప్రసాద్, స్వరూప, బుచ్చ య్య, ఆలేం అశోక్, మహిళా అధ్యక్షురాలు సరో జన, ప్రధాన కార్యదర్శి కొప్పుల బతుకమ్మ, తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష నాయకుల పిలుపు
ఎకరానికి రూ. 50వేలు చెల్లించాలని డిమాండ్