
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం/ములుగు రూరల్: గిరిజన ఆ శ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల న్యా యమైన కోర్కెలు పరిష్కరించాలని సీఐటీయూ జి ల్లా అధ్యక్ష,కార్యదర్శులు రత్నం రాజేందర్, ఎండీ. దావూద్ అన్నారు. జీఓ నంబర్ 64ను రద్దు చేయాలంటూ జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెను శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట చేపట్టారు. సమ్మెకు దావూద్ హా జరై మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను, కాంటింజెంట్, పార్ట్‌టైం వర్కర్లకు 2021 జూన్ 15న బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో విడుదల చేసిన జీఓ నంబర్ 64 ప్రకారం వేతనాలు చెల్లిస్తే వేతనాలు పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉందన్నారు. వర్కర్ల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఏసీ గదులకే పరిమితం అయితే కార్మికుల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, 2014లో నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 212ను అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కమల, సమ్మ క్క, సంతోషా, లక్ష్మీ, సత్యం,రాజు,రత్నం ప్రవీణ్ బాలేశ్వర్, కోట య్య, తదితరులు పాల్గొన్నారు.