
అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
ములుగు రూరల్: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవి సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పాటుపడి ప్రాణాలు కోల్పోయారని వారి సేవలను కొనియాడారు. అటవీ సంపద పరిరక్షణ ప్రతీవ్యక్తి బాధ్యతని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ములుగు పరిధిలో 35, ఏటూరునాగారం పరిధిలో 31 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ డోలి శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యశిబిరం
ఏటూరునాగారం: అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ ఉద్యోగులు గురువారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ అడవుల రక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను విస్మరింఝ ద్దని సూచించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 31 మంది అధికారులు, ఉద్యోగులు కార్యాలయంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), దూలాపురం అటవీ రేంజ్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి