
మరింత సహకారం
వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు
రైతు ఉత్పత్తి సంఘాలుగా పీఏసీఎస్‌లు
ములుగు రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు అందించడం, వసూలు చేయడానికి పరిమితమైన పీఏసీఎస్‌లు రూపు మార్చుకోనున్నాయి. విడతల వారీగా సంఘాలను ఆధునికీకరించడంతో పాటు రైతులకు ఆదాయం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు ఉత్పత్తి సంఘాలను(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) మార్పు చేసింది. ఈ మేరకు జిల్లాలో 8 సంఘాలను ఎంపిక చేసింది.
10 మండలాలు.. 12 సంఘాలు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో రైతు ఉత్పత్తి కేంద్రాలుగా 8 సంఘాలు ఎంపికయ్యాయి. ఈ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులే సంఘాలుగా ఏర్పడి తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించనుంది. దీంతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు ఇవ్వనుంది. డ్రోన్, రోబోటిక్స్ వంటి యంత్రాల వినియోగంపై సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మార్కెటింగ్, ధాన్యం నిల్వలు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ, పాల ఉత్పత్తి సంఘాల ఏర్పాటు, శీతల గిడ్డంగుల నిర్మాణం, జౌషది కేంద్రాల ఏర్పాటు, ఆధునిక వ్యవసాయ పరికరాల విక్రయం, మత్స్యకేంద్రాల నిర్వహణ వంటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తారు.
నిర్వహణ ఖర్చులు మంజూరు
రైతు ఉత్పత్తి కేంద్రాలుగా ఎంపికై న పీఏసీఎస్‌లకు ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.18లక్షలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీంతో పాటు అదనంగా రూ.15 లక్షలు ఈక్విటి గ్రాంట్ విడుదల చేస్తుంది. ఒక్కో ఎఫ్‌పీఓకు క్రెడిట్ గ్యారంటరీ కింద రూ. 2 కోట్ల వరకు గ్యారంటీ సదుపాయం లభిస్తుంది.
జిల్లాలో 8 సొసైటీల ఎంపిక
ప్రభుత్వ నిధులతో వ్యాపారం
రైతుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా
అడుగులు
జిల్లాలో మొత్తం 12 సంఘాలు ఉండగా అందులో 8 సంఘాలు రైతు ఉత్పత్తి కేంద్రాలుగా ఎంపికయ్యాయి. సంఘాల అభివృద్ధితో పాటు సొసైటీల పరిధిలో ఉన్న రైతులు ఐకమత్యంతో వ్యాపారం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. సంఘాల పరిధిలోని రైతులకు ఆధునాతన వ్యసాయం, యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తారు.
– సర్దార్‌సింగ్, జిల్లా సహకార అధికారి

మరింత సహకారం

మరింత సహకారం