
వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి
ములుగు రూరల్: వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని పక్షంలో సీనియర్ సిటిజన్ యాక్టు ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారు కలెక్టర్ లేదా ఆర్డీఓను సంప్రదించాలని సూచించారు. సీనియర్ సిటిజన్‌లు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కార మార్గం చూపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో బాసాని రాంమూర్తి, అసోసియేషన్ అధ్యక్షుడు దామెర నర్సయ్య, దామోదర్, యుగేందర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా బాసాని రాంమూర్తి, కో కన్వీనర్లుగా వెంకట్‌రెడ్డి, చందర్‌రావు, సంజీవరావులను ఎన్నుకున్నారు.
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని బీసీ వెల్ఫేర్ అధికారి తులరవి అన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్థంతిని జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ అధికారి తుల రవి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ మహిళా శక్తికిప్రతీకగా నిలిచారన్నారు. భూస్వాముల దౌర్జన్యాలకు తలొగ్గకుండా రైతుల పక్షన నిలబడి పోరాడిన వీరవనిత అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు రమేష్, చాపర్తి రాజు, మహేందర్, పరికరాల రవి, గూడెళ్లి ఓదెలు, నేరెళ్ల శంకర్, జాలిగం శ్రీనివాస్, భద్రయ్య, సారంగపాణి, బీసీ వెల్పెర్‌శాఖ అధికారులు సరిత, మానస, కుమారస్వామి, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమాధికారి తుల రవి

వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి