
ఓటరు తుది జాబితా ప్రదర్శన
జిల్లాలో మండలాల వారీగా ఎంపీటీసీల జాబితా
జిల్లాలో 10 జెడ్పీటీసీలు, 83 ఎంపీటీసీలు
ములుగు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల పరిషత్ సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ సభ్యుల (జెడ్పీటీసీ) తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్‌ల జాబితాను జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.సంపత్‌రావు బుధవారం విడుదల చేశారు. ఈ నెల 8లోపు అభ్యంతరాలు స్వీకరించి, 9న అభ్యంతరాలు పరిష్కరించి, బుధవారం పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటి పరిధిలో మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు.
మండలం గ్రామ ఎంపీటీసీలు ఓటర్లు
పంచాయతీలు
వెంకటాపురం(ఎం) 23 9 28,236
ఏటూరునాగారం 12 9 24,636
గోవిందరావుపేట 18 9 25,441
కన్నాయిగూడెం 11 5 9,992
మల్లంపల్లి 10 5 13,507
మంగపేట 25 14 39,369
ములుగు 19 9 24,985
ఎస్‌ఎస్ తాడ్వాయి 18 7 18,226
వెంకటాపురం(కె) 18 9 25,336
వాజేడు 17 7 19,431
171 గ్రామపంచాయతీలు
473 పోలింగ్ కేంద్రాలు
జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు