
ప్రతిభను వెలికితీసేందుకే పోటీలు
ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే కళాఉత్సవ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని జిల్లా విద్యాధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సమగ్రశిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్ పోటీలు జరగగా డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించగా అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలకు ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, కోఆర్డినేటర్ సాంబయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కందాల రామయ్య, సముద్రాల శ్రీనివాసచారి, హమీద్, బాలాజీ రవి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఈ కళాఉత్సవ్ పోటీల్లో బండారుపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి దీక్షరామ్ క్లాసికల్ డ్యాన్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని డీఈఓ సిద్ధార్థరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం దేవకి, సిబ్బంది అభినందనలు తెలిపారు. అదే విధంగా ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెంలోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు కళాఉత్సవ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారని ఎంఈఓ మల్లయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రూప్ డ్యాన్స్ , ఫోక్‌లో హర్షవర్ధన్, ఉమా మహేష్, రిషీక్, సాయినాధ్, కార్తీక్, వరుణ్, సందేశ్‌ల బృందానికి ప్రథమ బహుమతి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు వారు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2025కు ఎంపికై నట్లు ఆయన వివరించారు.
జిల్లా విద్యాధికారి సిద్ధార్థరెడ్డి