
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
ములుగు/ములుగు రూరల్: పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ వర్కర్స్, అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. కనీస వేతనాల అమలుతో పాటు 2వ పీఆర్‌సీ ప్రకారం రూ. 26వేలు చెల్లించాలని కోరారు. అదే విధంగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రమాదాలలో మరణించిన కార్మికులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నద్దునూరి సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా మాట్ల జయకర్, కోశాధికారిగా కావటి భాస్కర్, ఉపాధ్యక్షుడిగా నాంపెల్లి రఘు, ఎంపెల్లి స్వరూప, సహాయ కార్యదర్శులుగా గడ్డం నాగార్జున, దామర రాజు, కమిటీ సభ్యులుగా సాంబయ్య, రఘు, రాజేశ్వరి, మహేష్, బాలు, రాజేష్, పల్లవి, రంజిత్‌లను ఎన్నుకున్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్