
యూరియా కోసం బారులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట శనివారం యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో బారులుదీరారు. పది రోజుల తర్వాత సహకార సంఘం కార్యాలయానికి యూరియా బస్తాలు రావడంతో రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, ట్రైనీ ఎస్సై మధు రైతులు ఇబ్బంది పడకుండా క్రమ పద్ధతిలో యూరియా బస్తాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. రైతులు కార్యాలయం నుంచి జాతీయ రహదారి వరకు క్యూ కట్టి గంటల తరబడి క్యూలో నిలబడి పలువురు రైతులు ఇబ్బంది పడ్డారు. మండల వ్యవసాయశాఖ అధికారి కుమార్‌యాదవ్, ఇద్దరు ఏఈఓలను పీఏసీఎస్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచారు. పట్టాపాస్ పుస్తకం, ఆధార్‌కార్డు తీసుకు వచ్చిన రైతులకు అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేశారు. మరికొంతమంది రైతులకు యూరియా బస్తాలు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.