
హేమాచలుడి ఆలయం మూసివేత
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పూజారులు స్వామి వారి గర్భాలయం, ఉప ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నైవేద్యం సమర్పణ అనంతరం ద్వార బంధనం చేసి ఆలయాలను మూసివేసినట్లు ఈఓ రేవెల్లి మహేష్ తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు స్వామివారిని ఎప్పటి విధంగానే దర్శించుకోవచ్చని ఈఓ తెలిపారు.