
వైకల్యంతో పుట్టిన పిల్లలను గుర్తించాలి
ములుగు: వైకల్యంతో పుట్టిన పిల్లలను గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేయాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాలికల స్వస్థత కార్యక్రమంపై గురువా రం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్ర రక్తహీనత గల పిల్లలను గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారం, ములుగు ప్రభుత్వ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేయాలన్నారు. రోజు వారిగా స్క్రీనింగ్ వివరాలను ఆర్‌బీఎస్కే పోర్టలో నమోదు చేయాలన్నారు. ప్రతీ నెలలో పాఠశాలలను సందర్శించి వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు రణధీర్, పవన్ కుమార్, నరహరి, శ్రీనివాస్, మల్లిఖార్జున్, జయప్రద, డెమో సపంత్, కోఆర్డినేటర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు