
పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వే
ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో 25ఎకరాల్లో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను ఏఈఓ రాజు బుధవారం సర్వే చేశారు. రైతులు సాగు చేస్తున్న వరి, ఇతర పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. వరద ఉధృతి వల్ల నీరు పొలాల మీదుగా ప్రవహించడంతో ఇసుక మేటలు, వరి పైరు కొట్టుకుపోయినట్లు తెలిపారు. ప్రాథమిక సర్వే నివేదికలను అధికారులకు అందజేయనున్నట్లు ఏఈఓ రాజు తెలిపారు. కొండాయి గ్రామానికి రవాణా మార్గం లేకపోవడంతో పడవలో ప్రయాణించి సర్వే చేపట్టారు.
అదేవిధంగా మండలంలోని గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లి గ్రామాల్లో ఏఈఓ రవి సర్వే చేపట్టారు. పొలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు.