
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
మంగపేట: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో రిసెప్షన్ సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ శబరీశ్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగపేట పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ బుధవారం సందర్శించి పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని స్టేషన్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. అనంతరం స్టేషన్ నిర్వహణ రికార్డులను పరిశీలించి ప్రతీ వర్టికల్‌కు ఒక అధికారిని కేటాయించి రికార్డులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. విచారణలో ఉన్న కేసులను పరిశీలించి మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంప్యూటర్ సిబ్బంది పనులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ టీవీఆర్ సూరి, సిబ్బంది పాల్గొన్నారు.
గోదావరి ఉధృతి పరిశీలన
పోలీస్ స్టేషన్ తనిఖీ అనంతరం ఎస్పీ కమలాపురంలో గల ఇంటెక్‌వెల్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా వస్తుందని తెలిపారు. దీంతో గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు గోదావరికి చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.
ఎస్పీ డాక్టర్ శబరీశ్

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి