
వైఎస్సార్ దేశానికే ఆదర్శం
వెంకటాపురం(ఎం): దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దేశానికే ఆదర్శమని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తాళ్లపహాడ్‌లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంగళవారం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజల గుండెల్లో రాజన్న ఇంకా పదిలంగానే ఉన్నాడని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు మరువలేనివని అయిలయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్, కాంగ్రెస్ నాయకులు చెన్నోజు శ్రీనివాస్, జంగిలి రవి, చీకూర్తి రమేష్, ఎస్‌కె.జాకీర్, భూస సాంబయ్య, అన్నవేన రాజు, భూస గణేశ్, కూరెళ్ల సాంబయ్య, పులి రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.