
కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు
● బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్
నాగజ్యోతి
ములుగు: కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. కాళేశ్వరంపై విచారణ పేరుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, ప్రధాని మోడీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్రగా పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయని అలాంటి ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లాలో రైతులకు సకాలంలో యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు..