
కబడ్డీ పోటీల్లో తరంగిణి ప్రతిభ
వాజేడు: నేషనల్ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆదివాసీ బిడ్డ ఉయిక తరంగిణి ప్రతిభ చూపింది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన ఉయిక రమేష్–రాంబాయి ల కూతురు తరంగిణి ఖమ్మంలోని నవోదయలో చదువుతున్న క్రమంలో ఆటలపై మ క్కువ చూపేది. ఈ క్రమంలో కబడ్డీపై దృష్టి సారించి నేషనల్ స్థాయికి చేరుకుంది. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన నేషనల్ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆమె ఉత్తమ రైడర్‌గా ఎంపికై జిల్లాకు మంచిపేరు తీసుకొచ్చింది. ఆటల్లో మరింత ప్రతిభ చూపి ఉత్తమ క్రీడాకారిణిగా రాణించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని ఆమె వెల్లడించారు. తరంగిణి తండ్రి ఉయిక రమేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో 2024 నవంబర్ 21న మావోయిస్టులు హతమార్చిన ఘటన విధితమే.