
సీపీఎస్‌ను రద్దు చేయాలని నిరసన
ములుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ పోలురాజు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగులకు శాపమైన సీపీఎస్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న యూపీఎస్ విధానం కూడా ఆమోధయోగ్యంగా లేదన్నారు. అనంతరం సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సర్వర్ అహ్మద్, వాసుదేవరెడ్డి, ఆదిరెడ్డి, రాజునాయక్, మేడి చైతన్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.