
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
ములుగు రూరల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి నిమజ్జనానికి జిల్లా కేంద్రంలోని తోపుకుంట వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసీల్దార్ విజయభాస్కర్, సీఐ సురేష్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్‌రావులు పరిశీలించారు. నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఐదవ రోజు నిమజ్జనం చేశారు. అటవీశాఖ సిబ్బంది వినాయక నిమజ్జనంలో ఆటపాటలతో అలరించారు. వినాకుడిని వైభవంగా ఊరేగించి అనంతరం తోపుకుంటలో నిమజ్జనం చేశారు.