
వినతులిచ్చాం పరిష్కరించండి
గ్రీవెన్స్‌లో 50, గిరిజన దర్బార్‌లో 20 అర్జీలు
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు అజ్మీర బాలు. ఏటూరునాగారం మండలం లంబాడీతండా. ఈయన 2021–22లో ఈఎస్‌ఎస్ కింద కంగన్‌హాల్ షాపునకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఇతడికి ఐటీడీఏ ట్రైకార్, కెనరా బ్యాంక్ ద్వారా సబ్సిడీ రుణం వచ్చింది. ఈయన ఖాతాలో సుమారు రూ.80 వేలు రుణం జమ అయ్యాయి. కానీ ఆ రుణాన్ని బ్యాంక్ అధికారులు, ఐటీడీఏ అధికారులు కలిసి లబ్ధిదారుడికి అందజేయాల్సి ఉంది. కానీ దానిని అందించడం లేదు. నాలుగేళ్ల నుంచి బ్యాంక్, ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కానీ గ్రౌండింగ్ మాత్రం ఇవ్వడం లేదు. వ్యవసాయం చేయలేక ఇంటి వద్ద ఒక షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకునేందుకు చేసిన ప్రయత్నం అధికారుల వల్ల నీరుగారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల బాధితులు అనేకమంది ఉండడం గమనార్హం.
ములుగురూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ సమస్యలపై 70 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ టీఎస్.దివాకర అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్‌తో కలిసి వినతులు స్వీకరించగా ఐటీడీఏలో ఏపీఓ వసంతరావు డీడీ పోచంతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 50 ఫిర్యాదులు రాగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 20 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో దరఖాస్తుదారుడికి సమాచారం అందించి సమస్యను వివరించాలని సూచంచారు.
స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఏపీఓ వసంతరావు
పరిశీలించి సత్వరమే
పరిష్కరించాలని ఆదేశాలు

వినతులిచ్చాం పరిష్కరించండి