
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం
ములుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్ నాయకుల నుంచి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం బడే నాగజ్యోతి విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అనేది బీఆర్‌ఎస్ పార్టీపై జరుగుతున్న దాడి కాదని, తెలంగాణను ఎడారిగా మార్చే విద్రోహ చర్య అన్నారు. ఇందులో ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే ముగ్గురు ఒక్కటయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఎదురు తిరుగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పోరిక విజయ్ రాంనాయక్, కోగిల మహేష్, వేములపల్లి భిక్షపతి, చెన్న విజయ్, గొర్రె సమ్మయ్య, గండి కుమార్, ఆకుతోట చంద్రమౌళి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్
నాగజ్యోతి
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో
జాతీయ రహదారిపై ధర్నా

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం