
మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు..
మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు. పింఛన్ కోసం వెళ్తే నీ పేరున డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు. పింఛన్ అందించే ఉద్యోగిని అడిగితే పంచాయతీ కార్యదర్శి రాలేదు అంటూ తిప్పుతున్నాడు. మూడు నెలలుగా పింఛన్ రా కపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. అధి కారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– అంబటి సరోజన,
జాకారం, ములుగు మండలం
ఇందిరమ్మ ఇళ్ల జాబి తాలో పేరు వచ్చింది. దరఖాస్తు సమయంలో ఇంటి నిర్మా ణం ఉమ్మడి స్థలంలో నిర్మించుకుందామనుకుని నమోదు చేయించాను. ఇప్పడు అక్కడ అన్నదమ్ముల భూమి పంపకంలో ఇంటి నిర్మాణానికి ఇబ్బందిగా ఉంది. నాకు వేరే చోట స్థలం ఉంది. అక్క డ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పించాలి.
– అల్లి రాంబాబు,
సుందరయ్య కాలనీ, వాజేడు
ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోనా సమయంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా తాత్కాలిక పద్ధతిలో పనిచేశాను. మూడు నెలలు ఈ –హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రాంలో పని చేశాను. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. ములుగు ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఇప్పించి ఉపాధి కల్పించాలి.
– చిక్కుల రాకేశ్,
అబ్బాపూర్, ములుగు మండలం

మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు..

మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు..