
గిరిజన దర్బార్‌లో..
ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో కోయ భవన్ నిర్మాణానికి భూమిని కేటాయించడానికి ఐటీడీఏ అధికారులు దృష్టి పెట్టాలని బూటారానికి చెందిన గిరిజనులు కోరారు. మహబూబాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన గిరిజనుడు బెస్ట్ అవైలబుల్ స్కీం ఫీజు ఇప్పించాలని వేడుకున్నారు. రేగొండ మండలం రామన్నగూడెంకు చెందిన నిరుద్యోగి తనకు టెంట్‌హౌజ్ మీద రుణం ఇప్పించాలని కోరారు. ఇదే మండలంలోని రామన్నగూడెం తండాలో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టానని అందుకు రావాల్సిన బిల్లు ఇప్పించాలని కోరారు. మహదేవ్‌పూర్ మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన రైతులు రైతు భరోసా ఇప్పించాలని వేడుకున్నారు.
ఏటూరునాగారం మండలంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. ఇలా పలు సమస్యలపై బాధితులు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, డీటీలు కిశోర్, అనిల్, కొమురం ప్రభాకర్, కొండల్‌రావు పాల్గొన్నారు.