
సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలి
ములుగు రూరల్: భారీ వర్షాలు, వరద సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క సీఎం సలహదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్ సంపత్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్ రూంలలో 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, కుంటల మరమ్మతులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. నేటి నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందని తదితర అంశాలపై అధికారులకు సీఎం వివరించారు.
వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి