
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● కలెక్టర్ దివాకర టీఎస్
వెంకటాపురం(ఎం): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని లక్ష్మీదేవిపేటలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించి, మా ట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటేనే రూ.5 లక్షల సాయానికి అర్హులు అవుతారని స్పష్టం చేశారు. గ్రామంలో ఇళ్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించని లబ్ధిదా రులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. లక్ష్యాని కి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అనంతరం అడవిరంగాపూర్ ఎర్రకుంట చెరువు మత్తడి శివారులో గల రోడ్డు భారీ వర్షాల కా రణంగా తెగిపోయినందున తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నారా యణ, డీఈ రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ రాజు, ఏఈ జయంతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.