
జిల్లా ఓటర్లు 2,29,159
ములుగు: జిల్లాలోని 171 గ్రామ పంచాయతీల పరిధిలో 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు కలెక్టర్ దివాకర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఒంటేరు దేవరాజ్ మంగళవారం తుది జాబితా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. గత నెల 30వ తేదీ లోపు అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 31న పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 224 అభ్యంతరాలు రాగా విచారణ చేసి పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించినట్లు వెల్లడించారు.
171జీపీలు.. 1520 వార్డులు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులు ఉండగా 1536 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్త ంగా మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉండగా అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే అన్ని మ ండలాల్లో ఎక్కువగా ఉండడం గమనార్హం. గతంలో 1,535 పోలింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా మరో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అ ధికారులు ప్రకటించారు. గత నెల 28న జిల్లాలో 2,28,911 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించగా అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం 248 మంది అదనంగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించి 2,29,159 మందితో తుది జాబితా ప్రకటించారు.
తుది జాబితా ప్రకటించిన అధికారులు
224 అభ్యంతరాలు స్వీకరించి
పరిష్కరించిన అధికారులు