
కాకతీయ వైభవం ఉట్టిపడేలా అభివృద్ధి
వెంకటాపురం(ఎం): కాకతీయ వైభవం ఉట్టిపడేలా జంగాలపల్లి జంక్షన్ మాదిరిగా వెంకటాపురం మండల కేంద్రంలోని తాళ్లపహాడ్ వై జంక్షన్‌ను అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని రామాలయం వద్ద బొమ్మకంటి రమేష్ దంపతులు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వినాయకునికి పూజలు నిర్వహించగా శ్రీరామ యూత్ కమిటీ సభ్యులు సీతక్కను సన్మానించారు. అనంతరం మంత్రి సీతక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు అయిలయ్య, భగవాన్‌రెడ్డి, శ్రీనివాస్, నవనీత్, పోశాలు, రవి, రామాచారి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ
మంత్రి సీతక్క