
వరద బాధితులకు సామగ్రి పంపిణీ
● పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ
ఏటూరునాగారం: వరద బాధితులకు దుప్పట్లు, వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్‌తో కలిసి శనివారం అందజేశారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో కొండాయి, మల్యాల, దొడ్ల లోని 100 మంది వరద బాధితులకు సామగ్రిని అందజేసి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సీతక్క పిలుపు మేరకు రెలెయబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామగ్రి అందించినట్లు తెలిపారు. అనంతరం రిలెయబుల్ ట్రస్టు ప్రతినిధి తుపాకుల రవి మాట్లాడుతూ మంత్రి సీతక్క సూచనమేరకు బాధితులకు అండగా నిలిచినట్లు చెప్పారు. ఏజెన్సీలో తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాంపతి, తహసీల్దార్ జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, మండల అధ్యక్షుడు చిటమట రఘు, వావిలాల ఎల్లయ్య, గీకురు భాగ్య, తదితరులు పాల్గొన్నారు.