
అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం
వెంకటాపురం(కె): మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ఎఫ్‌డీఓ ద్వాలి యా తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం గ్రామ సమీపం నుంచి అక్రమంగా ఓ వ్యాన్‌లో తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎదిర, రామచంద్రాపురం, వెంకటాపురం అటవీ శాఖ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మొర్రవానిగూడెం గ్రామ శివారుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వారిని గమనించిన వ్యాన్ డ్రైవర్ సుమారు రూ.8 లక్షల విలువ చేసే టేకు కలపను వదిలేసి పారిపోయాడు. వాహనంతోపాటు కలపను వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ద్వాలియా తెలిపారు. దాడిలో శ్రీనివాసరా వు, దేవయ్య, లక్ష్మణ్‌దాస్ ఉన్నారు.