
తేరుకోని వాగవతలి గ్రామాలు
ఏటూరునాగారం: జిల్లాలోని మారుమూల ప్రాంతాలు వర్షాలు, వరదల నుంచి ఇంకా బయట పడలేదు. వాగవతలి గ్రామాలు తేరుకోకుండా వరద నీటికి భయపడుతూ జీవిస్తున్నారు. దీంతో కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎస్పీ శబరీష్ స్థానిక పోలీసులను అలర్ట్ చేసి సరిహద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు సేవలందించాలని ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలోని కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ఉండడంతో పడవలపైనే ప్రయాణాలను సాగించారు. ఎలిశెట్టిపల్లి వద్ద ప్రజలను దాటించేందుకు పడవను సిద్ధంగా ఉంచారు. తాడ్వాయి మండలంలోని జనగలంచ వద్ద రోడ్డు సగం వరకు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది.
పెరుగుతున్న గోదావరి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదా వరి నది క్రమంగా పెరుగుతుంది. ఏటూరునాగా రం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 8 గంటలకు 14.83 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జా రీ చేశారు. సాయంత్రం 4 గంటలకు 15.56 మీటర్ల వరద ఉధృతిగా ప్రవహిస్తోంది. 15.83 మీటర్ల నీటి మట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చే యనున్నారు. కన్నాయిగూడెంలోని సమ్మక్క బ్యారే జ్ వద్ద 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో గోదావరి నీటిమట్టం
పడవల ప్రయాణమే వారికి దిక్కు
అప్రమత్తమైన అధికారులు
రామన్నగూడెం వద్ద
15.56 మీటర్ల నీటిమట్టం

తేరుకోని వాగవతలి గ్రామాలు